టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు
- అత్యధిక 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా ఘనత
- ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ రికార్డు బద్దలు
- సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్న కోహ్లీ
- ఈ జాబితాలో వార్నర్, బాబర్ ఆజం, గేల్ వెనక్కి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్లో మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.
టీ20 ఫార్మాట్లో ఇది కోహ్లీకి 211వ 50కి పైగా పరుగుల భాగస్వామ్యం. ఈ క్రమంలో అత్యధిక అర్ధశతక భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ అలెక్స్ హేల్స్ (210) రికార్డును కింగ్ కోహ్లీ అధిగమించాడు. దీంతో పురుషుల టీ20 క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ ప్రత్యేక జాబితాలో కోహ్లీ, హేల్స్ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 200 భాగస్వామ్యాలతో మూడో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (196), వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (191) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పరుగుల వరద పారించడంలోనే కాకుండా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలోనూ తన నిలకడను కోహ్లీ మరోసారి చాటుకున్నాడు.